Do something

ఈ పేజి యొక్క భాషాంతరీకరణము

విండొస్ 7 సింస్

విండోస్ 7 సహాయం తో మైక్రోసాఫ్ట వినియోగదారులపై న్యాయపరమైన అధికారము పొందుతుంది.

మైక్రొసాఫ్ట స్టాండర్డ్స ప్రతికూలత...

స్టాండర్డ్స చాలా విలువైనవి.ఈ స్టాండర్డ్స తో వివిధ కంపూటింగ్ ప్లాట్ ఫారము వినియోగదారులు వాల్ల సమాచారాలను పంచుకునె అవకాశం ఉంటుంది. ఇవి విక్రయించు వారి కళ్ళెమును నివారిస్తాయి. ఇవి ఆఫీసు పత్రాలు లలో ఎక్కువగా విస్తరించి,ప్రభుత్వాలు(రాష్ట్ర మరియు జాతీయ పరంగా)భవిష్యత్తు రుజువు కొరకు నిర్ణయాలు తీసుకొనుటకు తోడ్పడుతున్నాయి.

స్థాపించబడ్డ ఫ్రీ మరియు ఓపెన్ ఫార్మాట్లను అడ్డుకోవటానికి మైక్రోసాఫ్ట్ ప్రమాణ క్రమ విధానాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తితో అడ్డగిస్తూ, తను ఏవైతే ప్రమాణ సంస్థల నుంచి ఆమోదాన్ని కోరుతుందో ఆ సంస్థల కీర్తిని ధ్వంసం చేస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతమున్న ఓపెన్ డాక్యుమెంట్ ప్రమాణాల్ని (ODF), తన సొంత ఆఫిస్ ఓపెన్ ఎక్స్ ఎం ఎల్ (OOXML)విధానంతో ఆక్షేపిస్తోంది. నిజానికి ఆఫిస్ ఓపెన్ ఎక్స్ ఎం ఎల్ విధానం అంతర్గతంగా సామాన్యమైన ప్రమాణాలను అమలు చేయకుండా కేవలం మైక్రొసాఫ్ట్ ఆఫిస్ ని మాత్రమేఅమలు చేస్తుంది.

ఓపెన్ డాక్యుమెంట్ ప్రమాణం వివిధ ఆపరేటింగ్ సిస్టంలలో బాగా సహకరిస్తుంది. కాని మైక్రోసాఫ్ట్ యొక్క ప్రమాణం కేవలం ఒక విక్రయదారుడి ప్రొప్రైటరి సాఫ్ట్వేర్ తోనే బాగా సహకరిస్తుంది. OOXML ని అమలు చేయటానికి కావలసిన ప్రమాణికాలు 6000 ల పేజీలకు పైగ ఉంది, దీనికి కారణమేమనగా మైక్రోసాఫ్ట్ ఆఫిస్ సాఫ్ట్ వేర్ లో ఉన్న ప్రతి తప్పిదాలను మరియు చారిత్రక లక్షణాలను అమలు చేయటానికి OOXML ను తీర్చిదిద్దారు. దీని వల్ల ఇతర సాఫ్ట్ వేర్ లు ఆ ప్రమాణాలను అమలు చేయటం చాలా కఠినమవుతోంది.

కేవలం ఆఫిస్ డాక్యుమెంట్ ల నే కాదు, మైక్రోసాఫ్ట్ ఇతర రంగాలలో కూడా ప్రమాణాలకు వ్యతిరేకంగా దూషిస్తోంది. మైక్రోసాఫ్ట్ తన ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ను కేవలం కొన్ని ప్రచురితమైన వెబ్ ప్రమాణాలను సహకరిస్తూ , ఇంకో ప్రక్క ఇతర వెబ్ బ్రౌజర్ లను వాడుతున్నవారికి తక్కువ స్థాయి అనుభవాన్ని దాఖలు చేస్తూ , ఇంటర్నెట్ రంగంలో తనకున్న గుత్తాధికారాన్ని దుర్వినియోగిస్తోంది. యూరోప్ లో మైక్రోసాఫ్ట్ యొక్క బ్రౌజర్ గుత్తాధికారాన్ని బలవంతంగా ముగించేందుకు, మైక్రోసాఫ్ట్ ను బలవంతంగా, విండోస్ 7 ఇన్ష్టాల్ చేసేటప్పుడు వినియోగదారుడికి బాలట్ స్క్రీన్ ప్రత్యామ్నాయ వెబ్ బ్రౌజర్ లను ఇచ్చే విధంగా చేసింది.

ఫ్రీ పరిమాణముల ద్వారా, మీరు ప్రీ సాఫ్ట్ వేర్ ను వాడే విధంగా నిశ్చయపరచడం ముఖ్యమైనది. ప్రొప్రైటరీ సాఫ్ట్ వేర్ లు చేసే హానులను ఫ్రీ పరిమాణములు క్షమించవు.

© 2009 ఫ్రీ సాఫ్టవేరు ఫౌండేషన్ , ఇన్ క్

క్రియేటివ్ కమంస్ కి అనుగునంగా ఈ పేజీ లైసెంసు చేయబడింది. Attribution-No Derivative Works 3.0 License.

విండోస్ 7 మరియు ప్రప్రైటరీ సాఫ్టవేరుకి వ్యతిరేకంగా కాంపేయిన్ నిర్వహిస్తున్న ఎఫ్ ఎస్ ఎఫ్