Do something

ఈ పేజి యొక్క భాషాంతరీకరణము

విండొస్ 7 సింస్

విండోస్ 7 సహాయం తో మైక్రోసాఫ్ట వినియోగదారులపై న్యాయపరమైన అధికారము పొందుతుంది.

విద్య

"ఒక మనిషికొ చేప ఇస్తె పూట గడుస్థుంది . అదే చేపలు పటడ్డం నెర్పిస్తె తన జీవనాధారం అవుతుంది ."

విద్యా రంగం లొ కంప్యూటర్లకి అత్యుత్తమైన స్థానం ఉంది .కానీ ఈరోజు చాలా మంది పిల్లల కంప్యూటరు విద్య ఒకే ఒక కంపనీ ఉత్పత్తి పైన ఆధారపడింది :మైక్రొసాఫ్ట — మైక్రొసాఫ్ట విద్యా సంస్థల సహాయం పొందుట కొరకు పెద్ద మొత్తం లొ డబ్బులు ఖర్చు చేయుచున్నది.

మైక్రొసాఫ్ట విద్యార్ధులకి విద్యావకాశం కల్పించడంతో వారు ఆర్ధికంగా లాభపడటమే కాకుండా విద్యార్ధులు తమ ఉత్పత్తులకు అలవాటుపడే అవకాశానికి దోహదపడుతుంది.మైక్రొసాఫ్ట్ తమ ఆపరేటింగ్ సిస్టం మరియు వివిధ సాఫ్ట్ వేర్లను స్కూళ్ళ సహాయం తో విద్యార్ధులకి నేర్పించడం వల్ల,వారి తల్లిదండ్రులను మైక్రొసాఫ్ట ఉత్పత్తులను కొనుటకు బలవంత పెడుతుంది.ఈ విధంగా కొన్ని కార్పరేటు సంస్థలు తమచే నిర్మితమైన ఉత్పత్తులను విద్యార్ధుల అవసరాల పెరిట వ్యాపరము చేయుచున్నవి.

యుఎస్ లోని వివిధ రాష్ట్రాలు మైక్రొసాఫ్ట ని పటించుకోకపొడం లేక మైక్రొసాఫ్ట చెడు ఉద్దేశాలను అర్ధం చేసుకోకపోవడం వల్ల మైక్రొసాఫ్ట కి సహాయపడుతున్నాయి.మైక్రొసాఫ్ట ప్రప్రైటరీ అవ్వడం వల్ల అది విద్యారంగానికి దోహదపడదు—విండోస్ వినియోగదారులు సాత్వికమైనవారు మాత్రమే,ఒక సమస్యను పరిష్కైంచుటకైనా లేక సోర్సు కోడ్ వీక్షించుటకైనా వీరు అనర్హులు. కంప్యూటరు విద్య ప్రతీఒక్కరికి స్వేచ్చ మరియు అధికారముచే వస్తుంది కానీ కార్పరేటు సంస్థల ప్రత్యేకాధికారము వల్ల కాదు.

ఇంకొవైపు ఫ్రీ సాఫ్టవేరు విద్యార్ధులకు స్వేచ్చ మరియు అధికారముతో కూడిన విద్యను అభ్యసించుటకు తోడ్పడుతుంది. ఫ్రీ సాఫ్టవేరు కు , వన్ లాప్ టాప్ పర్ చైల్డ (ఒ ఎల్ పి సి)ప్రాజెక్టు బాగా తోడ్పడింది. నికోలస్ నీగ్రోపొంతె 2003 లో ఒ ఎల్ పి సి ని విద్యార్ధులు ప్రపంచం లోని వివిధ టెక్నాలజీని మరియు స్వేచ్చ ని అభ్యసించుటకు నిర్మించారు. తకువ ధర పనికరం (ఎక్స ఒ నుండి మొదలు) నిర్మించుటతో కొన్ని కోట్ల మందికి దానిపై మరియు ఫ్రీ సాఫ్టవేర్ల పట్ల అవగాహన కలిగింది. ఫ్రీ సాఫ్టవేర్ల స్వేచ్చ వల్ల విద్యార్ధులకి సాఫ్టవేర్లను వీక్షించి, పరీక్షించే అవకాశం కలిగింది.

మైక్రొసాఫ్ట వత్తిడి పై, నీగ్రోపొంతే తన ప్రాజేక్టు ని ఫ్రీ సాఫ్టవేరు తోపాటుగా విండోస్ ఎక్స పీ ఆపరేటింగ్ సిస్టం వరకు పొడవించాలిసి వచ్చింది.

విద్యారంగం లో మైక్రొసాఫ్ట సంస్థే కాకుండా — అడోబు మరియు ఆపిల్ సంస్థలు కూడా వినియోగదారులను భయాందోలనకు గురి చేస్తుంది. ప్రత్యేకంగా అడోబు ఫ్లాష్ మరియు షాక్ వేవ్ ప్లేయర్లతో ఆపిల్ క్విక్ టైం మరియు ఐట్యూంస్ తో వినియోగదారులను భయాందోలనకు గురి చేస్తుంది.

మైక్రోసాఫ్ట ఇప్పుడు ఎక్స ఒ లు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వాలను ఫ్రీ సాఫ్టవేరుకి బదులుగా విండోస్ ఉపయోగించేలా చేస్తుంది, అది ఎంతవరకు సఫలీక్రుతం అవుతుందొ చూడాలి. మైక్రొసాఫ్ట ఇప్పటి వరకు తన వత్తిడి తో ఫ్రీ సాఫ్టవేర్ల పై పనిచేస్తున్న తకువ ధర పనికరాలైన ఒక మిలియన్ లాప్ టాప్ లను హాని చేసింది. ఒ ఎల్ పి సి మైక్రొసాఫ్ట తరహా లో ప్రభుత్వాలను ఒప్పించగలిగితే అది కుడా మిక్రొసాఫ్ట వంటి పెద్ద సంస్థ అవుతుంది. ఇది నిర్మూలించుటకు, మైక్రొసాఫ్ట విద్యార్ధుల విలువైన విద్యను ఎల హాని చేస్తుందో అన్న అంశాన్ని జనానికి తెలియజేయాలి. దాని కోసం షుగర్ అన్న సాఫ్టవేరును డౌంలోడ్ చేసి విద్యార్ధులకు ఫ్రీసాఫ్టవేర్ల అనుభవాన్ని కలిగించవచ్చు.

ఫ్రీ సాఫ్టవేరు దీనికి ఎలా దోహద పడుతుంది? ఫ్రీడం 1:ఒక ప్రోగ్రాము ఎలా పనిచేస్తుంది మరియు మనకనుగునంగా పనిచేయుటకు ఏమి చేయాలీ .

విద్యాసంస్ధలు ఫ్రీ సాఫ్టవేరునే ఎందుకు వడాలి?

© 2009 ఫ్రీ సాఫ్టవేరు ఫౌండేషన్ , ఇన్ క్

క్రియేటివ్ కమంస్ కి అనుగునంగా ఈ పేజీ లైసెంసు చేయబడింది. Attribution-No Derivative Works 3.0 License.

విండోస్ 7 మరియు ప్రప్రైటరీ సాఫ్టవేరుకి వ్యతిరేకంగా కాంపేయిన్ నిర్వహిస్తున్న ఎఫ్ ఎస్ ఎఫ్