Do something

ఈ పేజి యొక్క భాషాంతరీకరణము

విండొస్ 7 సింస్

విండోస్ 7 సహాయం తో మైక్రోసాఫ్ట వినియోగదారులపై న్యాయపరమైన అధికారము పొందుతుంది.

విద్య

"ఒక మనిషికొ చేప ఇస్తె పూట గడుస్థుంది . అదే చేపలు పటడ్డం నెర్పిస్తె తన జీవనాధారం అవుతుంది ."

విద్యా రంగం లొ కంప్యూటర్లకి అత్యుత్తమైన స్థానం ఉంది .కానీ ఈరోజు చాలా మంది పిల్లల కంప్యూటరు విద్య ఒకే ఒక కంపనీ ఉత్పత్తి పైన ఆధారపడింది :మైక్రొసాఫ్ట — మైక్రొసాఫ్ట విద్యా సంస్థల సహాయం పొందుట కొరకు పెద్ద మొత్తం లొ డబ్బులు ఖర్చు చేయుచున్నది.

ప్రొప్రైటరీ సాఫ్టవేరు విద్యారంగాన్ని ఎలా నాశనం చేస్తుంది

'విద్య' సిన్ కి లింకు

మైక్రొసాఫ్ట విద్యార్ధులకి విద్యావకాశం కల్పించడంతో వారు ఆర్ధికంగా లాభపడటమే కాకుండా విద్యార్ధులు తమ ఉత్పత్తులకు అలవాటుపడే అవకాశానికి దోహదపడుతుంది.మైక్రొసాఫ్ట్ తమ ఆపరేటింగ్ సిస్టం మరియు వివిధ సాఫ్ట్ వేర్లను స్కూళ్ళ సహాయం తో విద్యార్ధులకి నేర్పించడం వల్ల,వారి తల్లిదండ్రులను మైక్రొసాఫ్ట ఉత్పత్తులను కొనుటకు బలవంత పెడుతుంది.ఈ విధంగా కొన్ని కార్పరేటు సంస్థలు తమచే నిర్మితమైన ఉత్పత్తులను విద్యార్ధుల అవసరాల పెరిట వ్యాపరము చేయుచున్నవి.

యుఎస్ లోని వివిధ రాష్ట్రాలు మైక్రొసాఫ్ట ని పటించుకోకపొడం లేక మైక్రొసాఫ్ట చెడు ఉద్దేశాలను అర్ధం చేసుకోకపోవడం వల్ల మైక్రొసాఫ్ట కి సహాయపడుతున్నాయి.మైక్రొసాఫ్ట ప్రప్రైటరీ అవ్వడం వల్ల అది విద్యారంగానికి దోహదపడదు—విండోస్ వినియోగదారులు సాత్వికమైనవారు మాత్రమే,ఒక సమస్యను పరిష్కైంచుటకైనా లేక సోర్సు కోడ్ వీక్షించుటకైనా వీరు అనర్హులు. కంప్యూటరు విద్య ప్రతీఒక్కరికి స్వేచ్చ మరియు అధికారముచే వస్తుంది కానీ కార్పరేటు సంస్థల ప్రత్యేకాధికారము వల్ల కాదు.

ఇంకొవైపు ఫ్రీ సాఫ్టవేరు విద్యార్ధులకు స్వేచ్చ మరియు అధికారముతో కూడిన విద్యను అభ్యసించుటకు తోడ్పడుతుంది. ఫ్రీ సాఫ్టవేరు కు , వన్ లాప్ టాప్ పర్ చైల్డ (ఒ ఎల్ పి సి)ప్రాజెక్టు బాగా తోడ్పడింది. నికోలస్ నీగ్రోపొంతె 2003 లో ఒ ఎల్ పి సి ని విద్యార్ధులు ప్రపంచం లోని వివిధ టెక్నాలజీని మరియు స్వేచ్చ ని అభ్యసించుటకు నిర్మించారు. తకువ ధర పనికరం (ఎక్స ఒ నుండి మొదలు) నిర్మించుటతో కొన్ని కోట్ల మందికి దానిపై మరియు ఫ్రీ సాఫ్టవేర్ల పట్ల అవగాహన కలిగింది. ఫ్రీ సాఫ్టవేర్ల స్వేచ్చ వల్ల విద్యార్ధులకి సాఫ్టవేర్లను వీక్షించి, పరీక్షించే అవకాశం కలిగింది.

మైక్రొసాఫ్ట వత్తిడి పై, నీగ్రోపొంతే తన ప్రాజేక్టు ని ఫ్రీ సాఫ్టవేరు తోపాటుగా విండోస్ ఎక్స పీ ఆపరేటింగ్ సిస్టం వరకు పొడవించాలిసి వచ్చింది.

విద్యారంగం లో మైక్రొసాఫ్ట సంస్థే కాకుండా — అడోబు మరియు ఆపిల్ సంస్థలు కూడా వినియోగదారులను భయాందోలనకు గురి చేస్తుంది. ప్రత్యేకంగా అడోబు ఫ్లాష్ మరియు షాక్ వేవ్ ప్లేయర్లతో ఆపిల్ క్విక్ టైం మరియు ఐట్యూంస్ తో వినియోగదారులను భయాందోలనకు గురి చేస్తుంది.

మైక్రోసాఫ్ట ఇప్పుడు ఎక్స ఒ లు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వాలను ఫ్రీ సాఫ్టవేరుకి బదులుగా విండోస్ ఉపయోగించేలా చేస్తుంది, అది ఎంతవరకు సఫలీక్రుతం అవుతుందొ చూడాలి. మైక్రొసాఫ్ట ఇప్పటి వరకు తన వత్తిడి తో ఫ్రీ సాఫ్టవేర్ల పై పనిచేస్తున్న తకువ ధర పనికరాలైన ఒక మిలియన్ లాప్ టాప్ లను హాని చేసింది. ఒ ఎల్ పి సి మైక్రొసాఫ్ట తరహా లో ప్రభుత్వాలను ఒప్పించగలిగితే అది కుడా మిక్రొసాఫ్ట వంటి పెద్ద సంస్థ అవుతుంది. ఇది నిర్మూలించుటకు, మైక్రొసాఫ్ట విద్యార్ధుల విలువైన విద్యను ఎల హాని చేస్తుందో అన్న అంశాన్ని జనానికి తెలియజేయాలి. దాని కోసం షుగర్ అన్న సాఫ్టవేరును డౌంలోడ్ చేసి విద్యార్ధులకు ఫ్రీసాఫ్టవేర్ల అనుభవాన్ని కలిగించవచ్చు.

ఫ్రీ సాఫ్టవేరు దీనికి ఎలా దోహద పడుతుంది? ఫ్రీడం 1:ఒక ప్రోగ్రాము ఎలా పనిచేస్తుంది మరియు మనకనుగునంగా పనిచేయుటకు ఏమి చేయాలీ .

విద్యాసంస్ధలు ఫ్రీ సాఫ్టవేరునే ఎందుకు వడాలి?

మైక్రొసాఫ్టకి డి ఆర్ యమ్ ప్రియమైనది.

డిజిటల్ రెష్ట్రిక్షంస్ మ్యానేజిమెంట్ (డి ఆర్ యమ్)లు టెక్నాలజీ నిబన్ధనలు. ఇవి ఒక వ్యక్తి తనకి ఇష్టమైన విధము లో కంప్యూటరు వాడుటకు అనుమతించవు. డి ఆర్ యమ్ ప్రత్యేకంగా విండోస్ కొరకు నిర్మితమైనది, మరియు ఎన్నెన్నో మైక్రొసాఫ్ట సేవలు వినియోగదారులను డి ఆర్ యమ్ తో నిబంధించుచున్నాయి. మైక్రొసాఫ్ట ఈ నిభందనలతో టీవీ కంపనీలు, హాలీవుడ్ మరియు మ్యూజిక్ పరిశ్రమలను నిర్బంధించింది.ఇంకో తరహాలో మైక్రొసాఫ్ట డి ఆర్ యమ్ ఈ కంపనీల డిమాండులను అతిక్రమించినపుడు , మైక్రొసాఫ్ట డి ఆర్ యమ్ ఉపయోగించి ఒక కళ్ళెము నిర్మిస్తుందని పెర్కొంది. ఇవి పెద్ద మీడియా కంపనీలపై మైక్రొసాఫ్ట దురాలొచనైనా డి ఆర్ యమ్ పై మిక్రొసాఫ్ట న్యాయపరమైనా కానీ సాఫ్టవేర్ వినియోగదారులకు ఒక్కటే....

విండోస్ 7 తో మీడియాకి మీ కంప్యూటరు పై అధికారము వస్తుంది.

'డి ఆర్ ఎమ్' సిన్ కి లింకు

పెద్ద మీడియా కంపనీల మొనోమానీయాకల్ భయం ఏమిటంటే వినియోగదారులు మీడీయాని పంచుకొనుట మరియు పబ్లిక్ మీడియా లైబ్రరీలను నిలుపుకొనుట. పబ్లిక్ మీడియా లైబ్రరీలు మనిషి విజ్ఞాన వికాసాలను— లేక ఏదైనా వార్తను — ఏమాత్రము డబ్బులు ఖర్చుచేయకుండా ప్రపంచమంతటా పంచుకొనుట కు నిర్మింపబడిన సంస్థలు. పిటుపి నెట్వర్కు డిజిటల్ లైబ్రరీకి ఒక ఉదాహరణ . కానీ మీడియా కంపనీలు సామాన్య వినియోగదారుల కంటే వారి సంస్థ షేరు హోల్డరులను ద్రుష్టిలో పెట్టుకొని కంపనీల లాభాలకు వినియోగదారుని అడ్డుకుంటుంది.కంప్యూటర్లు తొందరగా మరియు సౌకర్యంగా పంచుకొనుటకు సహకరించేట్టు తయారుచేయబడ్డాయి, ఈ పంచుకోడాన్ని ఆపుటకు పెద్ద మీడియా కంపనీల మైక్రొసాఫ్ట వంటి సాఫ్టవేర్ ఉత్పత్తిదారుల సహకారం చాలా అవసరం.

పెద్ద మీడియా కంపనీలు పంచుకొనుట నిర్మూలించడానికి మైక్రొసాఫ్టని రెండు సహాయాలు కోరింది.

  • మొదటిది మైక్రొసాఫ్ట డీఅర్ఎం డ్ మ్యూజిక్ లేక మూవీ ఫైల్ ల్ల తరహాలోనే బయటకి వెళ్ళె డిజిటల్ సిగ్నల్లకు కళ్ళము వేయుట.ఇలా కాంచో‌ మూవీ ఫైల్ ను సిస్టం నుంచి తీ‌సి డిజిటల్ కమెరాలో రికార్డు చేసుకొనే అవకాశం ఉంటుంది.దీని కోసం విండోస్, ఫైలు ప్రదర్షింపబడుతున్నప్పుడు పనికరం ఏదైనా సహకరిస్తుందేమోనని నిరంతరంగా చూసుకుంటుంది. ఈ ఆంటీఫీచర్ని ప్రోటెక్టడ్ మీడియా పాత్ అని అంటారు. మైక్రొసాఫ్ట ఈ సౌకర్యాన్ని విష్టా నుండి ప్రవేశపెట్టింది.

  • రెండవది, మైక్రఒసాఫ్ట ప్రదర్షింపబడుతున్న సమయము లో ఇంకే ప్రోగ్రాము ఆడియో మరియు వీడియో కి అడ్డు పడకుండా చూస్తుంది.వినియోగదారుడిని తనకి ఇస్టమైన అప్లకేషంలను ఇంస్టాల్ చేసి వాడుటకు ఇవి అనుమతించవు.విష్టా మరియు విండోస్ 7 మీడీయా ప్రదర్షింపబడునపుడు అనవసరమైన అప్లికేషంలు ఎదురైనప్పుడు ప్రదర్శింపబడుతున్న మీడియాని ఆపివేయును.కానీ, డీఅర్ యం ని క్రాక్ చేసి మీడియాని ఇంటర్నెట్ లో ప్రవెశపెట్టారు. మీడెయాని పంచుకొనుట వినియోగదారుల ప్రప్రధమ హక్కుకాబట్టి విష్టా మరియు విండోస్ 7 వినియోగదారులకు —వెనుపల అన్ని వేలలా కోడు పనిచేయునప్పటికి —వారినెవ్వరు అడ్డుకొనలేరు.

ఉదాహరనకు మైక్రొసాఫ్ట సంస్థ ఎన్ బిసి సంస్థ అడుగుటమేరకు టెలివిజన్ కార్యక్రమాలను రికార్డు చేయుటకు అనుమతించలేదు.కానీ వారు ఎఫ్ సిసి కోరిక మేరకు చేశామని అనగా, ఎఫ్ సిసికి అటూంటి అధికారము లేదని సెకండు సర్వీసు కోర్టు పేర్కోనింది.

మీడియా కంపనీలు వదిలేసినా మైక్రొసాఫ్ట డీఅర్ ఎం ని ప్రవేశపెడుతుంది.ఈ సంవత్సరం ఎనో ఆంలైన్ మ్యూసికల్ స్టోర్లు డీఅర్ ఎంని తొలగించాయి.కానీ మైక్రొసాఫ్ట డీఅర్ ఎం తో కూడుకున్న మోబైల్ ఫోంస్ గురించి ఒక మ్యూసిక్ స్టోర్ ని ప్రవేశపెట్టింది. — దీనిలో మైక్రొసాఫ్ట ఒక అడ్డంకును ప్రవేశపెట్టింది: సహజంగా ప్రతీ వినియోగదారుడు ఆరు నెలలకోసారి తన సెల్ఫోను మారుస్తాడు, కానీ అందులో పాటలు పంపుకోనుట సాధ్యము కాదు. సెల్ఫోను మార్చుట వలన వారు పాటలు కోల్పోతారు. ఈ తరహాలో మ్యూజిక్ కంపనీలు ప్రయత్నించక పోయినా, మైక్రొసాఫ్ట ఈ డి ఆర్ ఎం ని ప్రోత్సాహిస్తుంది.వినియోగదారులు మైక్రొసాఫ్ట సర్వీసు సహాయం తో మ్యూజిక్ కొనుగోలు చేసినపుడు, వేరే మ్యూజిక్ ప్లేయర్లను వాడడానికి కుదరదు.మైక్రొసాఫ్ట ప్రవేశపెట్టిన జ్యూన్ ప్లేయర్ "ప్లేస్ ఫార్ షూర్"డి ఆర్ ఎంవలన కొన్ని మ్యూజిక్ సర్వీసులు అమ్మిన(ఎం టి వి మ్యూజిక్ సర్వీస్ విండోస్ మీడియా ప్లేయర్ లోబిల్టిన్అని ప్రవేశపెట్టినా)పాటలను ప్రదర్శింపలేకపోయింది. మైక్రొసాఫ్ట డీఅర్ ఎం ని పెద్ద మీడియా కంపనీల వత్తిడిపైనే కాదు , తన సొంత లాభం కొరకు నివారించుటలేదు.

మైక్రొసాఫ్ట ఒక్క సంస్థే కాదు.ఆపిల్ తన ఐట్యూంస్ ద్వారా,మరియు మషింటోష్, ఐపాడ్, ఐఫోను మెరియు ఆపిల్ టీవి ద్వారా వినియోగదారులపై డి ఆర్ ఎం నిభందనలను ప్రవేశపెడుతుంది. కానీ మైక్రొసాఫ్ట విండోస్ 7 పై డి ఆర్ ఎం నిభందనలు చాలా తీవ్రంగా ఉండడం వల్ల కొనుగోలు కష్టటమైంది.

ఫ్రీ సాఫ్టవేరు, సహజంగానే, డి ఆర్ ఎం ని సపోర్టు చేయ్యదు —ఫ్రీ సాఫ్టవేరుకలో డి ఆర్ ఎం ని కలిపితే వినియోగదారులు మరియు డెవలెపర్లు పనిచేసి తొలగిస్తారు.

ఇంకొన్ని వివరాలకు : డిజిటల్ రైట్స మానేజిమేంటు పై వ్యతిరేకత

సెక్యూరిటి

"మన కంప్యూటరు సెక్యూరిటి కంప్యూటరు మరియు నెట్వర్క అను రెండు అంశాలమీద ఆధారపదుంటుంది:మి కంప్యూటర్ మరియు నెట్వర్క రక్షణ కొరకు మీరు ఏమి చేయుచున్నారు మరియు వేరే వినియోగదారులు వారి కంప్యూటర్ మరియు నెట్వర్క రక్షణ కొరకు ఏమి చేయుచున్నారు. మీకు నెట్వర్క రక్షణ ఒక్కటే సరిపోదు,తోటి వినియోగదారులు రక్షన కల్పించలేకపోయినా, మన సిస్టం దాడికి గురవ్వొచ్చు.రక్షన లేని కంప్యూటర్లు నెట్వర్కు లో కలుపుకొనుట వల్ల కంప్యూటర్లపై తీవ్రంగా మరియు మరింత వేగంగా దాడులు జరుగుతాయి, డినాయల్ ఆఫ్ సర్వీసు దాడి చాలా సులభంగా మన కంప్యూటరుని దాడి చేస్తుంది.అందువల్ల ఎన్ని ఎక్కువ రక్షన లేని కంప్యూటర్లు వాడితే అంతే ఎక్కువ దాడి మన కంప్యూటర్లకి జరుగుతుంది"

-- బ్రూస్ షిన్నర్

ఫ్రీ సాఫ్టవేరు ప్రొప్రైటరీ సాఫ్టవేర్లకంటే ఎక్కువ రక్షన కలిగిస్తుంది.

'సెక్యూరిటీ' సిన్ కి లింకు

మీ కంప్యూటర్ సురక్షితం అని మీకు ఎలా తెలుసు? ప్రప్రైటరీ సాఫ్తవేరు ఉపయొగిస్తే మీకు తెలియదు,ఫ్రీ సాఫ్టవేరు వల్ల తెలుసుకొనుటకు మీకు నేర్పు లేకపోయినా నేర్పుగలవారు తెలియజేస్తారు అనే నమ్మకం ఉంటుంది.

వైరస్సు వల్ల మరియు దూరపు వినియోగదారులు మన కంప్యూటరు పై దాడి చేయుట వల్ల విండోస్ కి చాలా రక్షన లోపాలు ఉన్నాయి.సాఫ్టవేరు సోర్సకోడు దొరకదు కాబట్టి , వినియోగదారులు మైక్రొసాఫ్ట సమస్యలు నివారించేవరకు వేచివుండక తప్పదు.కానీ మైక్రొసాఫ్ట తన రక్షన నిబంధనాలకనుగునంగా నడుచుకుంటుంది కానీ వినియోగదారులను పట్టించుకోదు.

2005 లో, అన్ని వర్షన్ ల విండోస్ ఆపరేటింగ్ సిస్టంలను హాని చేసే ఒక సమస్యని కనుగొన్నారు.అది 1990లో విడుదలైన విండోస్ 3.0 మోదలు, డిసెంబరు 2005 లో విడుదలైన విండోస్ సర్వరు 2003 ఆర్2 తోపాటు ఎక్సపీ మరియు దాన్ని తరువాత విడుదల చేయబడిన ఆపరేటింగు సిస్టంలను నాశనం చేసింది.క్లిప్ఆర్ట మరియు వివిధ వెక్టారు ఇమేజిలకు ఉపయోగించే మెటాఫైల్ ఫార్మాట్టును ఈ సమస్య హాని చేస్తుంది. ఇమేజ్ లు పనిచేయకపోయినా వినియోగదారుని కోడు పనిచేయుటకు అన్ని ఫైల్లల్లో'ఎస్కేప్ కోడ్స'ఉంటాయి.

సెక్యూరిటీ రిసర్చర్, స్టీవ్ గిబ్సన్ అంతర్జాతీయంగా చాలా తప్పులున్నాయని పేర్కొన్నారు.

ఈ క్రింది విధాలుగా మన ఫైల్లను వీక్షించుటకు అవకాశము ఉంది:

  • ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ తో వెబ్ సైటుని వీక్షించినపుడు.
  • విండోస్ ఎక్సపోరర్ తో చిత్రాలను వీక్షించినప్పుడు.
  • రక్షన లేని ఈమేయిల్లను మైక్రొసాఫ్ట అవుట్ లుక్ సహాయం తో వీక్షించినప్పుడు.

మైక్రొసాఫ్ట తమ ఆఫీసు సాఫ్టవేరు తోటి మాల్వేరు లోని ఒక కొత్త రకాన్ని పరిచయం చేస్తుంది.ఆ మాక్రో వైరస్సు ఆఫీసు స్ప్రెడ్ షీట్లు మరియు వర్డ ప్రాసెసర్లలో ఉంటాయి.

విండోస్ లోని అడ్మినిస్ట్రేటరు అకౌంటును అన్ని పనులకు వాడుటవలన , అవి మన కంప్యూటరుకి ఆపరేటింగు సిస్టాన్ని నాశనము చేసే మాల్వేరుని అనుమతిస్తుంది.

ఫ్రీ సాఫ్టవేర్లలో సమాజానికి మరియు టెక్నిగల్ అంశాలకు సంభందించిన సమస్యల కలగకుండా, సెక్యూరిటీ మరియు ప్రైవసీని నాశనం చేయకుండా ,మన అవసరాలమేరకు అడ్మినిస్ట్రేటరు అకౌంటును వాడుటకు అనుమతిస్తుంది.

మైక్రొసాఫ్ట ప్రత్యేకాధికారము

ప్రపంచమంతట తన ప్రత్యేకాధికారం తొ మైక్రొసాఫ్ట నేరము చెసినట్టు వెలుబడింది.మైక్రొసాఫ్ట పిసి ఉత్పత్తిదారులతో కలిసి విండోస్ విష్టా కొరకు,ప్రత్యెకమైన హార్డవేరు విలువల పిసీని విడుదల చేసి ఆపరేటింగ్ సిస్టం అప్ డేషన్ తో వినియోగదారులని కొత్త కంప్యూటర్ల దారిన పడవేసింది.

మైక్రొసాఫ్ట ప్రత్యేకాధికారము వినియోగదారుని స్వేచ్చను తొలగిస్తుంది

'ప్రత్యేకాధిపత్యమ్' సిన్ కి లింకు

డాస్ ఆపరేటింగ్ సిస్టం తో పనిచేసే పాత మైక్రోసఫ్ట ఉత్పత్తులు(విండొస్ 3.1 తరహాలో వచినవి) మైక్రొసాఫ్ట దికాని డాస్(డిజిటల్ రెసర్చ వారి డి ఆర్ డాస్) కనుగొనుటతో సైగ చేసేది . ఒక సందర్భం లో మైక్రొసాఫ్ట సిఇఒ బిల్ గేట్స గారు"యం యస్ డాస్ పై పనిచేసే డి ఆర్ డాస్ పై పనిచేయని కొన్ని అప్లికేషంలు ఎల పని చేస్తాయి అని అదిగితే ఎవ్వరూ చెప్పలేరు" అని అన్నారు. ఇంకొక సందర్భము లో మైక్రొసాఫ్ట వైస్ ప్రెసిడెంటు బ్రాడ్ సిల్వర్ బర్గ "ఒక వినియోగదారుడు అసౌకర్యాన్ని పొందినపుడు కారణము డి ఆర్ డాస్ అయితే యం యస్ డాస్ నిస్సందేహంగా కొనవచ్చును"అని పేర్కొన్నారు.

మైక్రొసాఫ్ట గ్నూ/లైనక్స కి విరుద్దమైన పేటెంట్లను అమ్ముటకు ప్రయత్నించింది, కానీ ఆ పేటెంట్లను ఓపెను ఇన్నొవేషన్ నెట్వర్కు కొనుక్కుంది(ఫ్రీ సాఫ్టవేర్లను కాపడుటకు నిర్మించబడ్డ సంస్థ).

ఈ మధ్య కాలము లో అమజాన్.కో.యుకే వారు గ్నూ/లైనక్స వినియోగదారుల నోట్ బుక్ కంప్యూటర్ల కొనుగోలు పై విండోస్ లైసెన్ స్ ఫీ ని తెరిగిచేస్తున్నారు. ఇది అలవాటుగా మారుతుందెమో ఎవరికి తెలుసు?

దారుణమేమిటంటే, కంప్యూటర్ తయారీదారులు విండొస్ లేని ఆపరేటింగ్ సిస్టం లను విక్రయించుట లేదు.

విండొస్ టాక్స నుంచి తప్పించుకునేందుకు మన సాఫ్టవేరు మనమే నిర్మించుకొనుట సమాధానమనిపిస్తుంది.అటువంటి సంస్థలలో న్యూఎగ్ అని ఒక సంస్థ విండొస్ ఒఇ యం కాపీను కొనుటకు ప్రయత్నించగా, మైక్రొసాఫ్ట మరియు ఇంకొన్ని ప్రొప్రైటరీ సాఫ్టవేరు సంస్థలు అనుమతించలేదు.

విండోస్ ప్రత్యేకాధికారము మైక్రొసాఫ్ట ఉత్పత్తులపైనే కాదు: చాలా మంది ఉత్పత్తిదారులు విండొస్ తోనే సిస్టం లని తరలిస్తారు, ఎంద్కంటే వారు చాలా ప్రొప్రైటరీ సాఫ్టవేర్లతో ఒప్పందం కుదుర్చుకుంటారు.

ఫ్రీ సాఫ్టవేరుకి ఈ సమస్య ఉండదు:ఫ్రీ సాఫ్టవేరుపై ఎలాంటి ప్రత్యేకాధికారము ఉండదు, ఎందుకంటె ప్రతీఒక్కరి దెగ్గర సోర్సు కోడు ఉంటుంది.ఈ కోడు సహాయం తో ప్రతీఒక్కరు సాఫ్టవేరుని మార్చవచ్చును. కొంతమంది పిసి ఉత్పత్తిదారులు గ్నూ/లైనక్స తో కంప్యూటర్లను విక్ర్యించుచున్నప్పటికీ, పెద్ద సంస్థల ఉత్పత్తిదారులు విండోస్ తో కలిసి ప్రొప్రైటరీ సాఫ్టవేరునే విక్రయిస్తున్నారు.

ఇంకొన్ని విషయాలకు: మైక్రొసాఫ్ట ఆంటీట్రష్టు ట్రయల్ మరియు ఫ్రీ సాఫ్టవేరు

మైక్రొసాఫ్ట స్టాండర్డ్స ప్రతికూలత...

స్టాండర్డ్స చాలా విలువైనవి.ఈ స్టాండర్డ్స తో వివిధ కంపూటింగ్ ప్లాట్ ఫారము వినియోగదారులు వాల్ల సమాచారాలను పంచుకునె అవకాశం ఉంటుంది. ఇవి విక్రయించు వారి కళ్ళెమును నివారిస్తాయి. ఇవి ఆఫీసు పత్రాలు లలో ఎక్కువగా విస్తరించి,ప్రభుత్వాలు(రాష్ట్ర మరియు జాతీయ పరంగా)భవిష్యత్తు రుజువు కొరకు నిర్ణయాలు తీసుకొనుటకు తోడ్పడుతున్నాయి.

ఓపెన్ డాక్యుమెంటు కి విరుధంగా మైక్రోసాఫ్ట దాడి

'ష్టాండర్డ్స' సిన్ కి లింకు

స్థాపించబడ్డ ఫ్రీ మరియు ఓపెన్ ఫార్మాట్లను అడ్డుకోవటానికి మైక్రోసాఫ్ట్ ప్రమాణ క్రమ విధానాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తితో అడ్డగిస్తూ, తను ఏవైతే ప్రమాణ సంస్థల నుంచి ఆమోదాన్ని కోరుతుందో ఆ సంస్థల కీర్తిని ధ్వంసం చేస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతమున్న ఓపెన్ డాక్యుమెంట్ ప్రమాణాల్ని (ODF), తన సొంత ఆఫిస్ ఓపెన్ ఎక్స్ ఎం ఎల్ (OOXML)విధానంతో ఆక్షేపిస్తోంది. నిజానికి ఆఫిస్ ఓపెన్ ఎక్స్ ఎం ఎల్ విధానం అంతర్గతంగా సామాన్యమైన ప్రమాణాలను అమలు చేయకుండా కేవలం మైక్రొసాఫ్ట్ ఆఫిస్ ని మాత్రమేఅమలు చేస్తుంది.

ఓపెన్ డాక్యుమెంట్ ప్రమాణం వివిధ ఆపరేటింగ్ సిస్టంలలో బాగా సహకరిస్తుంది. కాని మైక్రోసాఫ్ట్ యొక్క ప్రమాణం కేవలం ఒక విక్రయదారుడి ప్రొప్రైటరి సాఫ్ట్వేర్ తోనే బాగా సహకరిస్తుంది. OOXML ని అమలు చేయటానికి కావలసిన ప్రమాణికాలు 6000 ల పేజీలకు పైగ ఉంది, దీనికి కారణమేమనగా మైక్రోసాఫ్ట్ ఆఫిస్ సాఫ్ట్ వేర్ లో ఉన్న ప్రతి తప్పిదాలను మరియు చారిత్రక లక్షణాలను అమలు చేయటానికి OOXML ను తీర్చిదిద్దారు. దీని వల్ల ఇతర సాఫ్ట్ వేర్ లు ఆ ప్రమాణాలను అమలు చేయటం చాలా కఠినమవుతోంది.

కేవలం ఆఫిస్ డాక్యుమెంట్ ల నే కాదు, మైక్రోసాఫ్ట్ ఇతర రంగాలలో కూడా ప్రమాణాలకు వ్యతిరేకంగా దూషిస్తోంది. మైక్రోసాఫ్ట్ తన ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ను కేవలం కొన్ని ప్రచురితమైన వెబ్ ప్రమాణాలను సహకరిస్తూ , ఇంకో ప్రక్క ఇతర వెబ్ బ్రౌజర్ లను వాడుతున్నవారికి తక్కువ స్థాయి అనుభవాన్ని దాఖలు చేస్తూ , ఇంటర్నెట్ రంగంలో తనకున్న గుత్తాధికారాన్ని దుర్వినియోగిస్తోంది. యూరోప్ లో మైక్రోసాఫ్ట్ యొక్క బ్రౌజర్ గుత్తాధికారాన్ని బలవంతంగా ముగించేందుకు, మైక్రోసాఫ్ట్ ను బలవంతంగా, విండోస్ 7 ఇన్ష్టాల్ చేసేటప్పుడు వినియోగదారుడికి బాలట్ స్క్రీన్ ప్రత్యామ్నాయ వెబ్ బ్రౌజర్ లను ఇచ్చే విధంగా చేసింది.

ఫ్రీ పరిమాణముల ద్వారా, మీరు ప్రీ సాఫ్ట్ వేర్ ను వాడే విధంగా నిశ్చయపరచడం ముఖ్యమైనది. ప్రొప్రైటరీ సాఫ్ట్ వేర్ లు చేసే హానులను ఫ్రీ పరిమాణములు క్షమించవు.

మైక్రొసాఫ్ట లాకిన్ నేర్పు

"ప్రవేశించు ,విస్తరించు, చల్లార్చు" -- ఈ విదంగా మైక్రొసాఫ్ట తన నేర్పు తో వినియోగదారులను ప్రొప్రైటరీ నియమాలకు కళ్ళెము వేస్తుంది .

సీక్రెట్ సాఫ్టవేరు పై మైక్రొసాఫ్ట ఆధారపడింది

'లాకిన్' సిన్ కి లింకు

మైక్రొసాఫ్ట విండోస్ మరియు ఆఫీసు పాత వర్షన్ లను తొలగించి వినియోగదారులను తప్పనిసరిగా అప్గ్రేడు చేసేట్టు చేస్తుంది . డెస్కటాప్ పై ఉపయోగించే ఫైల్ ఫార్మాట్ లను మార్చడం వల్ల వ్యాపార రంగాలలో అప్గ్రేడు తప్పనిసరి.

ఆప రేటింగ్ సిస్టం మరియు మైక్రొసాఫ్ట ఆఫీసు వంటి సాఫ్టవేర్లపై సహాయ నిరాకరించుటతో మైక్రొసాఫ్ట పెద్ద సంస్థలను అప్గ్రేడు చేసుకొనుటకు బలోపేతం చేస్తుంది. కొన్ని సాఫ్టవేర్లు మైక్రొసాఫ్ట విండోస్ కొత్త వర్షన్ లపై పనిచేయనందున సంస్థలు పూర్తి సిస్టం ని అప్గ్రేడు చేయవలసి వస్తుంది.

ఈ ప్రవర్తన మైక్రొసాఫ్టకే కాకుండా , ప్రప్రైటరీ సాఫ్టవేర్లు ఉత్పత్తి చేసే సంస్తలకి కూడా వర్తిస్తుంది.అడోబు పిడి ఎఫ్ వినియోగదారులకు తన పొరపాటులను వరుస అప్డేట్ల తో r నివారిస్తుంది.అలాగే అపిల్ సంస్థ విండొస్ లోసాఫ్టవేరు అప్డేట్లతో ఐ ట్యూంస వినియోగదారులకు సఫారీ వెబ్ బ్రౌజర్ ఇంస్టాల్ చేస్తుంది..

ఫ్రీ సాఫ్టవేరు ఈ సమస్య ని ఎలా నివారిస్తుంది: ఫ్రీ సాఫ్టవేరు వినియోగదారులకి సోర్సు కోడ్ అందుబాటులొ ఉండడం వల్ల, మూడు విధాలుగా సహాయపడుతుంది. మోదటిది, వినియోగదారుల సంఘం ఉత్పత్తులను అప్డేట్ల తో సహకరించి సమస్యలను నివరించగలరు(ఫెడోరా లెగసీ అను సంస్థ రెడ్ హాట్ 7.3 మరియు రెడ్ హాట్ 9 ఆపరేటింగ్ సిస్టం లకు సహకరించింది). రెండవది, కొత్త ప్రాజెక్టు అప్గ్రేడ్ల ద్వారా వినియోగదారులచే అభివ్రుద్ది కావుట నిర్నయిస్తుంది.మూడవది, ప్రతీ వినియోగదారుడు సాఫ్టవేరు డెవెలపర్ ని సంప్రదించి సాఫ్టవేరుని నిర్మించడానికి మరియు మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది.

మైక్రొసాఫ్ట మరియు ప్రైవసి

మీ కంప్యూటర్లు ఎవరి మాట వినాలనుకుంటున్నారు?

ఎక్కువ శాతం జనం వాల్ల కంప్యూటర్లు వారి మాట వినాలనుకుంటారు.దానిని వారు"ట్రష్టడు కంప్యూటింగ్ "అని సంభోదిస్తారు మరియు ఆ సాఫ్టవేరుని విండోస్ జెన్యూన్ లాభం అని పెర్కొంటారు, మిక్రొసాఫ్ట మరియు ఇంకొన్ని సంస్థలు భవిష్యత్తు లో కంప్యుటర్లు వినియోగదారుల మాటలు కాకుండా తమ మాటలు వినేటట్టు చేసి మన ప్రైవసీ ని భంగపరుస్తున్నాయి.

మైక్రొసాఫ్ట జెన్యూన్ నష్టం

'ప్రైవసీ' సిన్ కి లింకు

ఒక మైక్రొసాఫ్ట సిస్టం విండోస్ జెన్యూన్ లాభం (డ్బ్లుజి ఎ)దూరపు కంప్యూటర్లను వీక్షించడానికి ఉపయోగిస్తారు. డ్బ్లుజిఎ హార్డ డ్రైవ్ లోని వివిధ భాగాలను వీక్షించి మైక్రొసాఫ్ట కి వినియోగదారుడు వాడుతున్నది "అనుమతించిన" విండోస్ వెర్షనా అని తెలియజేస్తుంది. డ్బ్లు జిఎ ప్రతీ కంప్యూటర్లని వీక్షించి "అనుమతించిన" కంప్యూటర్ అని మైక్రొసాఫ్ట తేల్చని పిమ్మట మీ కంప్యూటర్ పనితనాన్ని బలహీన పరుచ వచ్చు.ప్రస్తుతానికి మైక్రొసాఫ్ట నిర్ధారించిన డ్బ్లుజిఎ వీక్షించేవి:

  • కంప్యూటర్ రూపము మరియు ప్రతిరూపము
  • బయాస్
  • మాక్ అడ్రెస్
  • ప్రతీ కంప్యూటరుకి ఉండే యూనిక్ నంబరు - గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైయర్ (జియుఐడి)
  • హార్డ డ్రైవ్ సీరియల్ నంబరు
  • ఆపరేటింగ్ సిస్టం ప్రాంతము మరియు భాషా
  • ఆపరేటింగ్ సిస్టంవర్షను
  • పిసి బయాస్ సమాచారము(నిర్మానము, వర్షను, తారీఖు)
  • పిసి ఉత్పత్తిదారుదు
  • వినియోగదారుని సెట్టింగులు
  • ఇనష్టలేషన్ మరియు దాని చెల్లు సమయము .
  • విండోస్ లేక ఆఫీసు ప్రాడెక్ట కీ
  • విండోస్ ఎక్స పీ ప్రాడెక్ట ఐడీ

డ్బ్లుజిఎ సాఫ్టవేరును తుడిచివేయడంతో పాటు ప్రైవసీకి సంభందించిన ఎన్నో పొరపాట్లకు కారణము అయ్యింది.వినియోగదారులను అడగకుండానే మిక్రొసాఫ్ట క్లిష్టమైన అప్డేట్లతో పాటు డ్బ్లుజిఎ కూడా అప్డేటవుతుంది. డ్బ్లుజిఎ ని స్పైవేరు అని కొందరు అనినా మైక్రొసాఫ్ట మాత్రం అలంటిదేమీలేదని మన ప్రైవసీని లేకుండా చేస్తుంది.

పనితీరు మార్చకుండానే విండోస్ 7 ని మైక్రొసాఫ్ట సంస్థ విండోస్ 7 ఆక్తివేషన్ టెక్నాలజీస్ గా మార్చనున్నారు.

మైక్రొసాఫ్ట "ట్రష్టడ్ కంప్యూటింగ్ " విధానాన్ని "పల్లాడియమ్ " అని పిలుస్తారు . ప్రొప్రైటరీ ప్రోగ్రాములు ముందు అనుమానమైన నిబంధనలు వాడినా పల్లాడియం ప్రపంచీకరన చేస్తుంది.

హాలీవుడ్ మరియు రికార్డు సంస్థలు పల్లాడియం సహాయం తో డౌంలోడ్ చేసిన వీడియోలు పాటలు ఒక నిర్ధారమైన కంప్యూటర్లలో ప్రదర్శింపబడం మరియు అధికారమైన ఫైల్లను పంచుకొనుట కస్టం.

కస్టంగా అవసరమైన ఫైల్లను పంచుకోడం చాలా దారునానికి వడకడుతుంది. ఈ సదుపాయము ఈమెయిల్ మరియు డాక్యుమెంట్లకు వాడ్నున్నారు --దీని వల్ల రెండు వారాలలొ ఈమెయిల్ అద్రుష్యమౌతుంది,లేక ఒక కంపనీకి సంభందించిన కంప్యూటర్ల పై డాక్యుమెంట్లు చదవబడును.

ఉదాహరణకు మీసంస్థలో మీపై అధికారి మిమ్మల్ని ఒక సురక్షితము కాని పనిని అప్పగించి, ఒక నెల తరువాత అది సురక్షితము కాదని మిమ్మలిని నిందించినపుడు ఆ ఈమెయిల్ మీకు సహకరిస్తుంది, పల్లాడియం వల్ల మీ ఈమెయిల్ అద్రుష్యమౌవ్వడం తో మీ పై నింద నిజం అయ్యేఅవకాశం ఉంది.

ట్రెకియస్ కంప్యూటింగు ఫ్రీ ఆప్రేటింగు సిస్టం మరియు వాటి ఉపయోగాలను పనిచేయనివ్వకపోవడం తో కష్టాలకి గురి చేస్తుంది.

ట్రెకియస్ కంప్యూటింగు వర్షన్ లు కొన్ని సంస్థలచే ఆమోదించబడిన ఆపరేటింగు సిస్టంలే ఉపయోగిస్తాయి.వాట్లో ఫ్రీ ఆపరేటింగు సిస్టంలు ఇన్ ష్టాలవ్వవు. కొన్ని ట్రెకియస్ కంప్యూటింగు వర్షన్ లలో ప్రతీ ప్రోగ్రాము కొందరు డెవలపర్లచే ఆమోదించబడాలి.

అటువంటి సిస్టం ల పై ఫ్రీ సాఫ్టవేర్లు పనిచేయవు.పనిచేయుట ఎలా అని నీవు తెలుసుకున్నా, ఇతరులకి చెప్పినా అది నేరము.

మరికొన్ని సమాచారాలకు — విండోస్ 7 సింస్ మేయిలింగ్ లిస్ట కు ఖాతాదారు అవ్వండి

వినియోగదారుల ప్రైవసీని ఫ్రీ సాఫ్టవేర్ ఫౌండేషన్ చాలా తీవ్రంగా భవిస్తుంది. దయచేసి ప్రైవసీ పాలసీనిచదవండి.

వేరువిధానము ఫ్రీ సాఫ్టవేరు తో స్వేచ్చ!

ఫ్రీ సాఫ్టవేరు ని వాడడం వల్ల న్యాయపరంగా నేర్చుకొని మిగితా వినియోగదారులతో పంచుకోవచ్చును. ఫ్రీ సాఫ్టవేరు అభ్యసించే సమాజాన్ని స్థాపన చేసింది.దీనితో మనం సేకరించిన సమాచారము వేరొక వినియోగదారులకు ఉపయోగపడి వారిచే అభివ్రుధ్ధి చెందును .

ప్రపంచనలుమూలల నుండి ఎథికల్ ప్రొగ్రమర్స కలిసి సాఫ్టవేరు ప్రొగ్రాము వ్రాసి దానిని పంచుకుంటే ఆని అభివ్రుద్ది ఎంత ఉంటుంది? కంప్యూటర్ లో ప్రావీన్యం లేనప్పటికి చూచి వ్రాసి పట్టుబడతాం అని భయమక్కరలేదు.—ఎందుకంటే మనము ఎలాంటి తప్పు చేయము కాబట్టి

వాస్తవానికి అలాంటి మూవ్మెంటు ఉంది మరియు మీరు దానిలొ భాగస్వాములవ్వొచు.

ఫ్రీ సాఫ్టవేర్ గురించి తెలుసుకోండి.

విండోస్7 సింస్: మైక్రొసాఫ్ట్ మరియు ప్రొప్రైటరీ సాఫ్ట్ వెర్ పై ప్రతికూలంగా కేసు

సరికొత్త మైక్రొసాఫ్ట విండోస్ ఆపరేటింగ్ సిష్టం, విండోస్ 7, విస్టా,ఎక్ష్సపీ ,మునుపటి ఆపరేటింగ్ సిష్టంస్ తరహా లోనే ప్రొప్రైటరీ సాఫ్టవేరు.ఈ సాఫ్తవేర్ లొ కూడా ఇతరులతొ పంచుకోడానికి, మారుపులు చేయడానికి అలాగే ఇది ఎలా పనిచేస్తుందో పరీక్షించడానికి అనుమతి లేదు.

వాస్తవానికి విండోస్ 7 ప్రొప్రైటరీ అంటే దానిని ఉపయొగించేవారికి కాపీ రైట్స,కాంట్రాక్టులు,పేటంట్ల ద్వారా మైక్రొసాఫ్ట న్యాయపరమైన అధికారం కల్పిస్తుంది . మైక్రొసాఫ్ట ఈ తరహాలో కంప్యూటర్ వినియొగదారులకు కళ్ళెము వెస్తుంది .ఈ విండోస్7సింస్.ఓఆజీ లొ ఫ్రీ సాఫ్టవేర్ ఫౌండేషన్ మైక్రొసాఫ్ట చేసే యేడు ఇబ్బందులను ఉదాహరించింది.

ఒక ఉత్తరం500 ఫార్టూన్ కంపనీలలొ 499 కంపనీలకు పంపుట జరిగింది (మైక్రొసాఫ్ట మాట వినుట అనుమానమె), కానీ ఇది ఆరంభం మాత్ర మె .......

మేము ఎక్కువ ఉత్తరాలు గుర్తించిన విండొస్ 7 నిర్న యాధికారులకు మీ సహాయము తో పంపుటకు ఇష్ట పడుతున్నాము.

మీరు $25 పంపినచొ , ఇంకొ 50 ఉత్తరములు పంపబడును, $100 పంపినచొ ఇంకొ 200 ఉత్తరములు పంపబడును అలాగే.

మా ఉత్త రం తో సంస్థలు ప్రయొజనం పొందుటకుమీ సూచనలు పంపండి.

1. విషమించిన విద్య: విద్యా రంగం లొ కంప్యూటర్లకి అత్యుత్తమైన స్థానం ఉంది .కానీ ఈరోజు చాలా మంది పిల్లల కంప్యూటరు విద్య ఒకే ఒక కంపనీ ఉత్పత్తి పైన ఆధారపడింది :మైక్రొసాఫ్ట .మైక్రొసాఫ్ట విద్యా సంస్థల సహాయం పొందుట కొరకు పెద్ద మొత్తం లొ డబ్బులు ఖర్చు చేయుచున్నది.కంప్యూటర్ విద్య ప్రతీఒక్కరికి స్వేచ్చ మరియు అధికారముచే వస్తుంది కానీ కార్పరేటు సంస్థల ప్రత్యేకాధికారము వల్ల కాదు.

2. తొలిగిపోతున్న ప్రైవసీ : మైక్రొసాఫ్ట విండోస్ జెన్యూన్ అడ్వాంటేజ్ పేరుతో వినియోగదారుల కంప్యూటర్లను వీక్షించుచున్నది.ఈ హక్కు మైక్రొసాఫ్తా కి ఉన్నదని లైసెంసింగ్ టర్ంస్ లొ వినియోగదారులను హెచ్చరిస్తుంది.

3. ప్రత్యేకాధికారము:ఈ మధ్య వినియోగదారుని ప్రమేయం లేకుండానే ప్రతీ కంప్యూటర్ తో విండోస్ ఆపరేటింగ్ సిస్టం ముందుగా ఇంష్టాలై వస్తుంది.విక్రయించు వారికి మైక్రొసాఫ్ట హర్డవేరు బట్టి అవసరాలకు కొన్ని సూచనలు ఇస్తుంది, ఇవ్వన్ని వినియోగదారుని ప్రమేయం లేకుండానే జరిగిపోవుట విషేషం. గ్నూ/లైనక్స ఆపరేటింగ్ సిస్టంలు ఇంస్టాలైన కంప్యూటర్ ల లో విండోస్ ముందుగానే ఇంస్టాలై ఉందుట వినియోగదారులను ఆశ్చర్యం లో పదవేయుచున్నది.

4. మైక్రొసాఫ్ట లాకిన్ నేర్పు: మైక్రొసాఫ్ట వినియోగదారులను క్రమంగా తమ సిస్టంలను అప్డేట్ చేసుకొనెటటు చేస్తుంది. విండోస్ మరియు ఆఫీసు పాత వర్షన్ లను అప్డేట్ చేయడం వల్ల హార్డవేరు అవసరాలు మారుతాయి. చాలా మంది వినియోగదారులు విండోస్ వర్షన్ తమ హార్డ్వేరుకి సరితూగకపోవడం వల్ల తమ కంప్యూటర్లను నిర్విరామంగా మార్చాలిసి వస్తుంది.

5. స్టాండర్డ్ల వ్యతిరేకత:మైక్రొసాఫ్ట ఫ్రీ స్టాండర్డ్స ని అనిచివేయుటకు బాగా ప్రయతిస్తుంది.ఎందుకంటే ఓపెను డాక్యుమెంటు విధానం తో ప్రొప్రైటరీ సాఫ్టవేర్లకి ఆటంకంగా తయరయింది.ఈ ఆటంకాలని అదిగమించుటకు మైక్రొసాఫ్ట ఉద్యోగులకు లంచం ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు.

6. డిజిటల్ రెస్ట్రిక్షన్ స్ మానేజిమెంటు: విండోస్ మీడియా ప్లేయర్లతో, మైక్రొసాఫ్ట పెద్ద మీడియా సంస్థల తో కలిసి ఆపరేటింగ్ సిస్టం లలో మీడియా ప్రదర్షించుటకు అనుమతించదు.ఉదాహరణకు,మైక్రొసాఫ్ట సంస్థ ఎన్ బిసి సంస్థ అడుగుటమేరకు టెలివిజన్ కార్యక్రమాలను రికార్డు చేయుటకు అనుమతించలేదు.

7.వినియోగదారుని సురక్షిత: వైరస్సు వల్ల మరియు దూరపు వినియోగదారులు మన కంప్యూటరు పై దాడి చేయుట వల్ల విండోస్ కి చాలా రక్షన లోపాలు ఉన్నాయి.సాఫ్టవేరు సోర్సకోడు దొరకదు కాబట్టి , వినియోగదారులు మైక్రొసాఫ్ట సమస్యలు నివారించేవరకు వేచివుండక తప్పదు.కానీ మైక్రొసాఫ్ట తన రక్షన నిబంధనాలకనుగునంగా నడుచుకుంటుంది కానీ వినియోగదారులను పట్టించుకోదు.

మీరూ సహాయ పడవచ్చు!

గ్నూ/లైనక్స వంటి ఫ్రీ సాఫ్టవేర్లు విండోస్ లాగానే సేవలు అందించడం తో పాటు వినియోగదారులను సాఫ్టవేరుని చదివి, మార్పులని చేసి, పంచుకునటకు సహాయపడుతుంది. ఫ్రీ సాఫ్టావేర్లు మైక్రొసాఫ్ట చేసే తప్పుల నుంచి తప్పించుకొనుటకు మంచి మార్గాలు గా మారుతాయి. ఫ్రీ సాఫ్టవేర్లు ఉపయోగించుట వలన సాఫ్టవేర్ల మరియు కంప్యూటర్ల వలన వచ్చే సమస్యలను వినియోగదారులే లేక ఫ్రీ సాఫ్టవేర్లు ఉపయోగించే వేరొక వినియోగదారుల వల్ల పరిష్కరించబడతాయి.

విండోస్ సింస్ గురించి మరియు వాటి నుంచి తపించుకొనుటకు ,ఇంకొన్ని వివరాలకు విండోస్సింస్.ఒఅర్ జి ని సంప్రదించగల. కాంపేన్ వార్తలకు , మిక్రొసాఫ్ట చేసే అరాచకాలకు, విండోస్ 7 వల్ల వచ్చే సమస్యలకు మరియు ఫ్రీ సాఫ్టవేర్ల వల్ల కలిగే ప్రయోజనాలకు పైనున్న వెబ్ సైట్ లో ఖాతా స్రుష్టించుకోగలరు.

ఈ నిర్ణయానికి ఎలా వచాం

రెండేల కిందట మైక్రొసాఫ్ట విండోస్ విష్టా విడుదల చేసింది ,కానీ అది బ్రోకెన్ సాఫ్టవేర్,డ్రైవర్లు మరియు ఎక్కువ నిభందనలచే వినియూగదారులనూ,సాఫ్తవేర్ అప్డేట్ కష్టాలతో డెవెలపర్లనూ నిరుత్సాహ పరిచింది .

 

రెండేళ తర్వాత,మైక్రొసాఫ్టె విండొస్ విష్టా నిరుత్సాహ పరిచిందని పెర్కుంది .వినియూగదారులు విష్టా అందించిన దౌన్గ్రేడ్ ని అంగీకరించలేదు, మైక్రొసాఫ్ట సరిదిద్దుకోవుటకు విండోస్ 7 ని ప్రకటించింది .విండొస్ 7, 2001 లో విండొస్ ఎక్సపీ లాగా, తక్కువ విధ్యుత్ నెట్ బుక్ కంప్యూటర్ లకు సామర్ధ్యంగా వ్యవహరిస్తుందనుకున్నారు. కానీ, విండోస్ 7 లో విండోస్ ఎక్సపి కన్నా చాలా పొరపాట్లను గ్రహించారు ఇవి నెట్ బుక్ కంప్యూటర్ వినియోగదారులను ఎన్ని వివిధ అప్ప్లికేషంలు పనిచేస్తాయో మైక్రొసాఫ్ట పై వదిలేసింది.

మైక్రొసఫ్ట అసహజమైన అడ్డంకులు ఆపరేటింగ్ సిస్టం లోకి ప్రవెషపెట్టింది.విండోస్ ఈ అడ్డంకులను ఇంకా ఎక్కువ విలువ గల మైక్రొసాఫ్ట వర్షన్ కొనుగోలుపై నివారిస్తుంది.

ఇది మైక్రొసాఫ్ట కి కొత్తేమీ కాదు, 1996 లో ప్రవేశపెట్టిన విండోస్ ఎన్ టి రెండు వర్షన్ లు విడుదల చేసింది: విండోస్ ఎన్ టి వర్క స్టేషన్ మరియు విండోస్ ఎన్ టి సర్వరు . విండోస్ ఎన్ టి సర్వరు విండోస్ ఎన్ టి వర్కస్టేషన్ కంటే $800 ఎక్కువ ధర.

 

విండోస్ ఎన్ టి సర్వరు ఎన్ టి వర్క స్టేషన్ కి సంబంధం లేకుండా వరుసగా కొన్ని సర్వరు అప్లికేషంలు అంద చేసింది."రెండు ఆపరేటింగ్ సిస్టం లు రెండు వేరె పనులకు విడుదల చేసాము "అని విండోస్ పెర్కుంది.విండోస్ ఎన్ టి వర్కస్టేషన్ అంచనాలకి అందకపోవడం వల్ల ఇంటర్ నెట్ కోసం విండోస్ ఎన్ టి సర్వరు ని విడుదల చేసారు.విండోస్ ఎన్ టి వర్క స్టేషన్ కి విండోస్ ఎన్ టి సర్వరు బేదం ఏమిటంటే ఎన్ టి వర్క స్టేషన్ 10 మంది టిసిపి/ఐపి వినియోగదారులనే అనుమతిస్తుంది కాని ఎన్ టి సర్వరు ఎంతమందినైనా అనుమతిస్తుంది.

చాలా మంది వినియోగదారులకు రెండు వర్షన్ లు ఒకేలాగా అనిపించాయి.ఓ రియల్లీ ప్రచురించిన అనాలసిస్ లో కూడా ఎన్ టి వర్క స్టేషన్ మరియు ఎన్ టి సర్వరు కి ఒకే విధమైన కర్నల్ మరియు ఒకే బైనరీ ఫైల్ కలిగిఉన్నాయని పేర్కొనింది. ఆపరేటింగు సిస్టం లలో నే వీటి మధ్య బేదం ఉంటుంది, ఎన్ టి సర్వరు లో మరికొన్ని ఫ్లాగ్స మరియు ఆప్షంస ఉంటాయి. ఎన్ టి వర్క స్టేషన్ అని పేరు కలిగిన సిస్టంలలో నిమిత్తమైన ఫంక్షంస్ ఉంటాయి.

అటువంటి నిమిత్తమైనవాటిని ఆంటీఫీచర్సు అని అంటారు. వినియోగదారునకు డెవలపర్ అందించని ఫీచర్లను ఆంటీఫీచర్ అని అంటారు. మైక్రొసాఫ్ట ఈ తరహా లో వినియోగదారులను ఒక పరమతి లో ఉంచుతుంది. ఈ పరమతి వినియోగదారుల ఇస్ట ప్రకారం నియమించింది కాదు.

కంపనీల ద్వారా అందిస్తున్న ఆంటీఫీచర్లు వినియోగదారులను ఫ్రీ సాఫ్టవేరులోనున్న సాఫ్టవేరులను వాడుటకు ప్రోత్సాహిస్తున్నయి. ఫ్రీ సాఫ్టవేర్లు ఆంటీఫీచర్లను అనుమతించవు.

ఆంటీఫీచర్లు లేకుండా వినియోగదారులు కనుగొని పంచుకొనుటకు ఒక ఫయరుఫాక్స వర్షన్ విడుదలైంది.

ఈ ఆంటీఫీచర్లు ఫ్రీ సాఫ్టవేర్ లో నుంచి తోలగించుట వలన వినియోగదారులను వాల్ల ఇస్టానుసారం చేయుటకు అనుమతిస్తుంది.

Resources

  • Flyer
  • Flyer

We'll be adding more soon. If you have a flyer to contribute, please send it to campaigns@fsf.org.

© 2009 ఫ్రీ సాఫ్టవేరు ఫౌండేషన్ , ఇన్ క్

క్రియేటివ్ కమంస్ కి అనుగునంగా ఈ పేజీ లైసెంసు చేయబడింది. Attribution-No Derivative Works 3.0 License.

విండోస్ 7 మరియు ప్రప్రైటరీ సాఫ్టవేరుకి వ్యతిరేకంగా కాంపేయిన్ నిర్వహిస్తున్న ఎఫ్ ఎస్ ఎఫ్